![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 రెండవవారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ లో ఏడుగురున్నారు. హౌస్ లోకి కామనర్స్ గా వచ్చిన కంటెస్టెంట్స్ పై నెగెటివిటి ఏర్పడింది. ఏం మాట్లాడతున్నారో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉన్నారు.. మొదటి వారం సెలబ్రిటీ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాగా.. ఈ వీక్ పక్కాగా ఒక కామనర్ వెళ్లిపోవడం ఖాయం. ఎందుకంటే ఓటింగ్ అలా పడుతుంది.
ఓటింగ్ లో అనుకోని రీతిలో సుమన్ శెట్టికి భారీ ఓట్లు వస్తున్నాయి. అత్యధిక ఓటింగ్ తో సుమన్ శెట్టి మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కుగా కనెక్ట్ అయ్యారు. మళ్ళీ ఈ వారం సంజన తనని నామినేట్ చేసిన పాయింట్ కూడా వ్యాలిడ్ కాదు. రెండవ స్థానంలో భరణి ఉండగా.. మూడో స్థానంలో మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. నాలుగో స్థానంలో డీమాన్ పవన్, అయిదో స్థానంలో ఫ్లోరా సైనీ, ఆరో స్థానంలో ప్రియశెట్టి ఉండగా.. చివరి స్థానంలో మర్యాద మనీష్ ఉన్నాడు.
గత వారంలో ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అవుతుందని అందరు భావించారు కానీ లాస్ట్ మినిట్ లో శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది. ఈ వారం లీస్ట్ లో ప్రియ, మనీష్ ఉన్నారు. వీళ్ళిద్దరు హౌస్ లోకి కామనర్స్ గా వచ్చిన వాళ్ళే.. అయితే ఈ ఇద్దరిలో ఎవరు బయకి వెళ్తారో తెలియాలంటే వీకెండ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |